Thursday, October 31, 2013

Devulapalli Krishna Sastry



దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి(1.11.1877-24.2.1980)

తెలుగు భావకవులలో అగ్రగణ్యుడైన కృస్ణశస్త్రి తూర్పుగోదావరి జిల్లా చంద్రంపాలెంలో జన్మించారు.పట్టభద్రుడైన కృష్ణశస్త్రి కొంతకాలం పెద్దాపురం మిషన్ హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు.

1920లో కృష్ణపక్షం భావకావ్యం రాశారు.తరువాత కన్నీరు,ప్రవాసము,ఊర్వశి,పల్లకి మొదలగు ఖండకావ్యాలు రాశారు.మద్రాసు కేంద్రంగా 1939-57 మధ్యకాలంలో రేడియోలో అనేక ప్రసంగాలు చేసారు.సంగీత రూపకాలు రాశారు.ఆయన అపూర్వమైన వక్త.గంటల తరబడి ప్రసంగిస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులై వినేవారు.

1951లో గేయ రచయితగా సినీరంగంలో ప్రవేశించారు.సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన ప్రతిభాశాలి ఆయన.మల్లేశ్వరి లో ఆయన సినీ ప్రస్తానం ప్రారంభం అయింది.ఆ చిత్రంలో ఆయన రాసినపాట"మనసునమల్లెల మాలలూగెనే" అనే పాట శ్రోతల మనసులను ఉయాలలూగిస్తుంది.కృష్ణపక్షంలోని ఆయన తొలిగీతం "ఆకులో ఆకునై" సినిమాలొ ఉపయోగించారు.సుమారుగా ఆయన 200సినిమా పాటలను రాశారు.1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచె కళాప్రపూర్ణ,1976లోపద్మభూషణ్,1978లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.తెలుగుసాహిత్యానికి ఎంతో సేవచేసిన కృష్ణశస్త్రి 1980 ఫిబ్రవరి 24న చెన్నై లో కన్నుమూశారు.శ్రి శ్రి ఆయనకు నివాళులర్పిస్తూ "తెలుగు దేశపు నిలువుటద్దం బద్ధలయ్యింది .షెల్లీ మళ్ళీ మరణించేడు.వసంతం వాడిపోయింది"అన్నారు.


దేవులపల్లి వారి తొలి సినిమాపాట

దేవులపల్లి కృష్ణశాస్త్రి - వికీపీడియా

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి - telugu cinema songs

సాహితీపరులు పాత్రికేయులతో సరసాలు – ఎన్.ఇన్నయ్య


No comments:

Post a Comment