Friday, November 4, 2016

Kartika Koti Somavaramu - కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము


7  నవంబర్  2016    కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము

కార్తీక  మాసమున పౌర్ణమి సోమవారము కాని, శ్రవణా నక్షత్రముతో కూడిన సోమవారము కాని కలిసి వచ్చిన రోజును కోటి సోమవారము అందురు. ఆ రోజు నియమ, నిష్ఠలతో ప్రాత:కాలముననే ధనికులు, పేదవారు, బాలలు, వృద్దులు, స్త్రీ, పురుషులనెడి బేధము లేకుండా నదీ స్నానమాచరించి, నుదుట విభూధిని ధరించి పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వదళములతో అర్పించిన, అభిషేకించిన కోటి జన్మల దరిద్రములు తొలగి సుఖశాంతములతో, సిరిసంపదలతో వర్థిల్లుతారు.

కోటి సోమవారమున చేసిన సోమవారం నియమ నిష్ఠలకు కోటి ఇతర  సోమవారముల  నియమ నిష్ఠల ఫలితము లభిస్తుంది అని పురాణముల చెబుతున్నాయి.

7  నవంబర్  2016  

ఈ రోజు  కార్తీక కోటి సోమవారము.  కోటి సోమవారము నాడు స్నానము, దైవ దర్శనము, పగటి ఉపవాసము తప్పక చెయ్యండి.


కార్తీక సోమవార వ్రత మహిమ



జనకా!  కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కనుక సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును.

కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును.  శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ  ప్రాప్తియు లభించ గలదు.

శివ సహస్రనామ స్తోత్రము
_______________


________________

కార్తీక   పౌర్ణమి   కార్తీక సోమవారము కలసిన రోజు


http://www.greatertelugu.com/telugu-books/Kartheekamasapuranam-book.htm

Tuesday, November 1, 2016

Kartika Puranam in Telugu - Chapter 7

శివ కేశ వార్చన  విధులు

వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి     ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.

'
ఇట్లు కార్తీక మహాత్య మందలి సప్తమధ్యాయము - సప్తమదిన పారాయణము సమాప్తం.

Kartika Puranam in Telugu - Chapter 6

దీపారాధన విధి- మహత్యం

ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు  దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.

ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట

పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను. ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.

అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న  మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.

ఇట్లు   కార్తీక మహాత్య మందలి ఆరవ రోజు పారాయణము సమాప్తము.

Kartika Puranam in Telugu - Chapter 5

వనభోజన మహిమ


ఓ జనక మహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజాన౦తరమున శివాలయమున న౦దు గాని విష్ణాలయము న౦దు గాని శ్రీ మద్భగవద్గీతా పారాయణము   తప్పక చేయవలయును అట్లు చేసినవారి సర్వ పాపములును నివృతి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకు౦టమునకు వెళ్ళుదురు. భగవద్గీత  కొంత వరకు పఠి౦చిన  వారికీ విష్ణు లోకం ప్రాప్తించును కడ కందలి శ్లోకము లో నొక్క ప దమైననూ కంటస్థ మొనరించిన యెడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో ని౦డి వున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యదోచిత౦గా  పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి,  ఉసిరి చెట్టు నీడను  భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షణ తా౦బూలములతో సత్కరించి నమస్కరించ వలయును.

వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం  చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను- యని  వశిష్టుల వారు  చెప్పిరి. అది విని జనక రాజు ' ముని వర్యా ! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మమేల కలిగెను? దానికి గల  కారణమేమి యని' ప్రశ్ని౦చగా వశిష్టుల వారు ఈ విధంబుగా చెప్పనారంభి౦చిరి.

కిరాత మూ షికములు మోక్షము నొందుట

రాజా! కావేరి తీర మ౦దొక చిన్ని గ్రామమున దేవశర్మ యను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ . చిన్న తనము నుండి భయ భక్తులు లేక అతి గారాబముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై  మెలగుచుండెను. అతని దురచారములును చూచి ఒకనాడతని  తండ్రి కుమారుని పిలిచి ' బిడ్డా! నీ దురాచారములు కంతులేకుండా వున్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొను చున్నారు. నన్ను నిలదీసి  అడుగు చున్నారు. నీవల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేక పోవుచున్నాను. కాన, నువ్వు కార్తిక మాసమున నదిలో స్నానం చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన, నీవు అటులచేయు'మని భోదించెను. అంతట కుమారుడు' తండ్రీ! స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని యింటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతెరేకర్ధములతో పెడసరంగా సమాదాన మిచ్చెను. కుమారుని సమాధానము

విని, తండ్రీ ' ఓరి నీచుడా! కార్తిక మాస ఫలము నంత చులకనగా చుస్తునావు కాన, నీవు అడవిలో రవి చెట్టు తొర్ర యందు యెలుక రూపములో బ్రతికేదవుగాక' అని కుమారుని శాపెంచెను. ఆ శాపంతో కుమారుడగు శివ శర్మ కు జ్ఞానోదయమై బయపడి తండ్రీ పాదములపై బడి ' తండ్రీ  క్షమి౦పుము. ఆ జ్ఞానా౦ధ కరములో బడి దైవమునూ, దైవకార్యములనూ  యెంతో చులకన చేసి వాటి ప్రభాములను గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు  పశ్చాత్తాపము కలిగినది. నక శాపవిమోచన మోప్పుడే  విదముగా కలుగునో దానికి తగు తరుణోపాయ మెమో వివరింపు'మని ప్రాదేయ పడెను. అంతట తండ్రీ ' బిడ్డా ! నాశపమును అనుభవి౦చుచు మూషికము వై పది యుండగా నివెప్పుడు కార్తిక మహత్యమును వినగాలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొ౦దు దువు ' అని కుమారుని వూరడించెను. వెంటనే శివ శర్మ యెలుక రూపము పొంది అడవికి పోయి, ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలమును తినుచు జీవి౦చుచు౦డెను.

ఆ యడవి కావేరి నది తీరమునకు సమీపమున నుండుటచే స్నానర్ధమై నదికి వెళ్ళు వారు అక్కడ నున్న య పెద్ద వట వృక్షము నీడను కొంత సేపు విశ్రమించి, లోకబి రామాయణము చర్చి౦చుకొనుచు నదికి వెళ్ళు చుండెడి వారు. ఇట్లు కొంత కాలమైన తరువాత కార్తిక మాసములో నొక రోజున మహర్షి యను విశ్వా మిత్రులవారు శిష్యాసమేతముగా  కావేరి నదిలో స్నానర్ధమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము వున్న ఆ వుత వృక్షం క్రినకు వచ్చి శిష్యులకు కార్తిక పురాణమును వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము విరి దగ్గరనున్న పూజద్రవ్యములలో నేదైనా తినే వస్తువు దొరుకుతుందే మోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో నొక కిరాతకుడు విరి జాడ తెలుసుకొని' విరు బాటసరులై వుందురు. విరి వద్ద నున్న ధనమపహరించ వచ్చు'న నెడు దుర్భుద్ది తో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునిశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపొయినది. వారికీ నమస్కరించి' మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శన౦తో న మనస్సులో చెప్పారని ఆనందము కలుగుచున్నది? గణ, వివరింపుడు' అని ప్రదేయపడెను. అంత విశ్వా మిత్రుల వారు ' ఓయి కిరాతక ! మేము కావేరి నది స్నానర్దామై ఐ ప్రాంతమునకు వచ్చితిమి. స్నాన మాచరి౦చి కార్తీక పురాణమునకు పతిన్చుచున్నాము. నీవును యిచట కూర్చుంది సావడనుడవై యలకి౦పుము' అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్దగా ఆలకించు చుండగా తన వెనుకటి జన్మ వృత్తంత మంతయు జ్ఞాపకమునకు వచ్చి, పురాణ శ్రవణ న౦తరము  వారికీ ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి యుండి పురాణ మంతయు వినుచుండిన యెలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణా రూపము నొంది ' ముని వార్య ! ధన్యోస్మి  తమ దయ వల్ల నేను కూడా యీ మూషిక రూపము నుండి విముక్తుడ నైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక జనకా! ఇహములో సిరి సంపదలు, పర లోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, యితరులకు వినిపించ వలెను.

ఇట్లు  కార్తీక మహాత్య మందలి ఐదవ రోజు పారాయణము సమాప్తం.

Kartika Puranam in Telugu - Chapter 4

దీపారాధన మహిమ

ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్వి ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసము ముఖ్యముగ  యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.

జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంట ప్రాప్తి నొ౦దుదురు. కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

శతృజిత్ కథ

పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుం డగా నచ్చుటకు పిk దుడను idముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నివెందుల కింత తపమాచరించు చున్నావు? ని కోరిక యేమి?' యని ప్రశ్ని౦చగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావ౦శము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని చెప్పెను. అంత మునిపున్గావుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.

వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దన ధర్మాలతో  నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు ప౦చిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటు౦బికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్ములు జేసి, ఆ బాలునకు ' శత్రుజి' యని నామకరణ ము చేయించి అమిత గరబముతో పెంచుచు౦డిరి. కార్తిక మాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థ మనుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని, యవ్వనమునము  రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలత్కరించుచు,యెదిరించిన వారిని దండి౦చుచు తన కమావా౦ఛా తిర్చుకోను చుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.  ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వ ర్ణి౦ చుట మన్మదునకై ననూ శక్యము గాదు.  అట్టి స్రీ క౦టపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చే ష్టుడై  కమవికరముతో నామెను సమీపించి తన కమవా౦ఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము, శిలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను.

ఇట్లుఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవా౦చ తీర్చు కొనుచు౦డిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచు౦డెను.

ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయి౦చుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో  సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున ' చీకటిగా వున్నది, దీపము౦డిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన  పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామా౦ధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల? చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు ' ఓ బాపడ!ఎ వరెంతటి  నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశి౦ఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు
శివధూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు ' అల యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణి౦చితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తి౦చ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి.

వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొ౦దుదురు.

ఇట్లు   కార్తిక మహాత్యమందలి నాల్గవ రోజు పారాయణము సమాప్తం.