Monday, October 31, 2016

Kartika Puranam in Telugu - Chapter 3


కార్తీక మాస స్నాన మహిమ

జన క మహరాజా ! కార్తి క మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము గలదై  చేసిన వారికి సక లైశ్వర్యములు కలుగుట యే గాక మరణానంతరము వారు  శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని , కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక, కార్తిక స్నానములు చేయరు. వారు   అవినీతి పరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క, పిల్లి గ జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు నయిననూ స్నాన దాన జపతపాదులు చేయక పోవుట వలన అనేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టిదురు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి  వినిపించెదను. సపరి వారముగా శ్రద్దగా ఆలకి౦పుము.

బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట

ఈ భారత ఖండ మదలి దక్షిణ ప్రా౦తమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞాన శాలి, సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై  అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్ష౦బు  పై భయంకర ముఖములతోను, దీర్ఘ  కేశములతోను, బలిష్ట౦బులైన కోరలతోను, నల్లని బాన పొట్టలతోను, చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసి౦చుచూ , ఆ దారిన బ్రోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయక౦పితము చెయుచు౦డిరి. తీర్ధ యాత్రకై  బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున  పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి  యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చ౦పబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయ౦కర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటి౦చుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ! ఆ నాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని, ని౦డు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - యి పిశాచములు  బారినుండి నన్ను రక్షించు తండ్రీ!  యని వేడుకొనగా, ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులుకు జ్ఞానో దయ౦ కలిగి ' మహానుభావా! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు  జ్ఞానో దయ౦ అయినది మమ్ము రక్షింపుడు' యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని' ఓయీ! మీరెవరు ? ఎందులకు మికి రాక్షస రూప౦బులు కలిగెను? మీ వృత్తా౦తము తెలుపుడు' యని పలుకగా వారు' విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు, మీ  దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు' అని అభయమిచ్చి, అందొక  బ్రహ్మ రాక్షసుడు తన వృ త్తాంతము యీవిదముగా చెప్పసాగెను.

' నాది ద్రావిడ దేశం . బ్రహ్మనుడను. నేను మహా పండితుడనని గర్వము గలవాడై నై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మని పసువునై ప్రవర్తి౦చితిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యం గా దానం లాగుకోనుచు, దు ర్వ్యనాలతో  భార్య పుత్రా దులను సుఖపెట్టాక, పండితుల నవమాన పరచుచు, లుబ్దు డనై లోక కంట కుడిగ నుంటిని.

ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తిక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తల౦పుతొ పదార్ధ సంపాదన నిమి త్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచెను. వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతనికి వద్ద నున్న ధనము, వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంతి వైచితిని. అందులకా విప్రునకు కోపము వచ్చి ' ఓరి ని చూడ ! అన్యక్రా౦తముగ డబ్బుకూడా బెట్టినది చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి గాక, నివు రాక్షసుడవై నార భక్ష కు డువుగా నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు'గాక! యని శపించు టచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తపెంచుకొవచును కానీ బ్రాహ్మణ శాపమును తపెంచాలేము గదా! కాన నయాప రాదము క్ష మి౦ పుమని వానిని ప్రా ర్ధి౦ చితిని. అందులకాతాడు దయదలచి' ఒయీ! గోదావరి క్షే త్రమ౦దొక వట వృక్షము గలదు. నివండు నివసించుచు యే బ్రాహ్మణువలన పునర్జన్మ నొ౦దు దు వు గాక' యని వేదలిపోయాను. ఆనతి నుండి నేని రాక్షస స్వరుపమున నభాక్ష ణము చేయుచున్దిని. కాన, ఓ విప్రోతమ! నన్ను న కుటుంబము వారిని రక్షిమ్పుదని మొదటి రాక్షసుడు తన వ్రుతంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు- ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడునే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి  అన్నమో రామచంద్రాయను నటులచేసి, వారి యెదుటనే ణ బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచు౦డేడివాడను.  నేను యెట్టి దానధర్మములు చేసి మెరుగును, నా బ౦ధువులను కూడా హింసించి వారి ధనమపహరి౦చి రాక్షసుని వలె ప్రవ ర్తి౦చితిని. కాన, నాకీ రాక్షస  సత్వము కలిగెను. నన్ని పాపప౦కిలము నుండి ఉద్దరి౦పుము' అని బ్రాహ్మణుని పాదములపై  బడి పరి పరి విధముల వేడుకొనెను.

మూడవ రాక్షసుడు కూడా తన వృ త్త౦తమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు  ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచు౦డేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము  లైనాను నర్పించక, భక్తులు గొనితేచ్చిన సంభారములను  నా వుంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు  చేసినందున నా మరణన౦ తరము యి రూపము ధరించితిని, కావున నన్ను కూడా పాప విముక్తి ని కావి౦పు' మని ప్రార్ధించెను.

ఓ జనక మహారాజ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి 'ఓ బ్రహ్మ రాక్షసులరా! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్య౦బులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును' యని, వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతనవిముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినాచో హరిహరాదులు సంతృప్తి నొంది, వారికీ సకలైశ్వర్యములు ప్రసాది౦చుతురు. అందువలన, ఎంత ప్రయత్నించిన సరే కార్తిక స్నానాలనా చరించాలి.

ఇట్లు మూడవ రోజు పారాయణము సమాప్తము.
 స్కాంద పురాణా౦తర్గత కార్తిక మహాత్యము.





________________

________________
Bhakti


_________________

_________________
Telugu Rose Movies

Thursday, October 27, 2016

Kartika Puranam in Telugu - Chapter 1 - కార్తీక పురాణము మొదటి అధ్యాయము

సంక్షిప్త పురాణము

ఒకప్పుడు వశిష్ట మహర్షి మిథిలానగరము నకు వెళ్ళెను. వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి!మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవత్సరములో  గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి  వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి" రాజ! కార్తిక మాసములో దైవ పూజ  సకల మానవులు  ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది . ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు దైవ కార్యముల యొక్క ఫలమింతని చెప్పనలవి గాదు.  అ౦తియే గాక కార్తీక మహత్యము వినినంత మాత్రముననే మానవులు  ఇహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు.  ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట

ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనాను యే వయసువాడైనను " ఉచ్చ- నీచ' అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి ,  దానధర్మములను, దైవ పూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదర నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను.

కార్తిక స్థాన విదానము

ఓ రాజ! యీ వ్రత మాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయి  స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ , పరమేశ్వరునకు, బైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యపాదన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను.

ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును.

తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి భగవంతునికి సమర్పించి తను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ,దేవాలయములో , లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును.

ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధ ముగా వత్త్రమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును , ప్రస్తుత  జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు . ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి , వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .

ఇది  స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి మొదటి అధ్యాయము


ధర్మ వివరణ

దానములు భోజనములు  దక్షిణలు ఎవరు ఇవ్వగలరు? సంపాదన  ఉన్న వారు మాత్రమె  ఇవ్వగలరు చెయ్య గలరు.  భగవంతుడు ఒక మనిషి ఇంకొక మనిషికి   చేసిన సహాయాన్ని పుణ్యముగా భావించును. అట్టి శక్తి లేనివారు భగవన్నామ స్మరణ వల్లనే పుణ్యాన్ని   పొన్దగలరు.


________________

________________
Rose Telugu Movies


Kartika Puranam in Telugu - Chapter 2 - కార్తీక పురాణము రెండవ అధ్యాయము-రెండవ రోజు పారాయణము


http://vissafoundation.blogspot.in/2015/11/1.html

http://telugubhaktiblog.blogspot.in/2012/08/blog-post_8406.html#.VCQpTpSSx6c


Updated  31 October 2016