Sunday, September 10, 2017

Inventions - Innovations - Telugu - ఆవిష్కరణలు


https://www.english-telugu.net/index.php?q=invention&qb=

https://www.english-telugu.net/english-to-telugu-meaning-innovation

ఆవిష్కరణ

ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం.  చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ. కంప్యూటర్ ఒక ఆవిష్కరణ.

ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.

ఇన్నొవేషన్‌ అంటే...ఆవిష్కరణ.

‘రివర్స్‌ ఇన్నొవేషన్‌’ - ఆవిష్కరణ తలకిందులైతే...
http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=1262


వైధ్య రంగంలో మరో కొత్త ఆవిష్కరణ..ప్రారంభదశలోనే కొనుగోలు చేసిన గూగుల్..
5 September,2017
సోనోసిస్ హెల్త్ అనే  స్మార్ట్ ఫోన్, ఫోన్లో ఉన్న సెన్సార్ల సాయంతో రకరకాల వైద్య పరీక్షలన్నీ రెప్పపాటులో చేయొచ్చు.
https://telugu.ap2tg.com/another-new-innovation-in-the-veterinary-field-is-google/INTERMEDIATE I YEAR PHYSICS(Telugu Medium) Question Bank
https://books.google.co.in/books?id=Ok6ICgAAQBAJ

INTERMEDIATE II YEAR PHYSICS(Telugu Medium) Question Bank
https://books.google.co.in/books?id=hLqHCgAAQBAJ

INTER II YEAR SANSKRIT (TELUGU MEDIUM): Model Papers, Question Bank
https://books.google.co.in/books?id=lbTbBQAAQBAJ

The Magic of Thinking Big
David J Schwartz
Random House, 04-Feb-2016 - Self-Help - 384 pages
https://books.google.co.in/books?id=ytB1CwAAQBAJ

Friday, September 8, 2017

Leafy Vegetables Farming TeluguSearch google:  ఆకు కూరల సాగు

ఆకు కూరల సాగు - అన్వేషణ

కట్టం తక్కువ.. లాభాలెక్కువ!
Sakshi November 12, 2014
ఆకు కూరల సాగుతో ఎంతో మంది రైతులు తక్కువ కాలంలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
http://www.sakshi.com/news/vanta-panta/less-difficulties-in-cultivation-of-celery-184359

Sunday, April 23, 2017

AP, Telangana, India, World News in Telugu - తెలుగు వార్తలు
తెలుగు వార్తలు


23 April 2017

7 AM News

నేడు ప్రధాని  ఆధ్వర్యములో నీతి ఆయోగ్ సమావేశం. 15 సంవత్సరముల అభివృద్ధి పధకం పై చర్చ.
______________________


______________________

ETV Andhra Pradesh

22 ఏప్రిల్ 2017

మిషన్ భగీరథ కు మరో అవార్డు.
ఐపిల్ 10 లో ధోని మంచి ప్రదర్శన. పూణే విజయం. 

______________________

______________________

Friday, April 21, 2017

S. Janaki - Biography and Songs - YouTube Videos -యస్ జానకి

Birthday 23 April

(జ.ఏప్రిల్ 23,1938)

She says singing came to her naturally.

She said, she learned classical singing for only one year.


Jhummandi Naadam - Episode - 3
_____________________

https://www.youtube.com/watch?v=RCW681a-L5k
_____________________

  Episode - 4
_____________________

https://www.youtube.com/watch?v=kd7m97RUwr4
_____________________

S.Janaki Super Hit Songs Collections - 2016
Volga Video
_____________________

_____________________


S Janaki Melody Super Hit Songs
iDream Telugu Movies

_____________________

_____________________

S Janaki Telugu Hits | Top 10 Hit Songs | Video Jukebox |
Mango Music
_____________________


_____________________

S. Janaki Hit Songs Collection - Audio

______________________

______________________

ఎస్.జానకి  దక్షిణభారత నేపథ్యగాయని. గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామములో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. ఈమె తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో  22,000  పాటలు పాడినది.

 ఎమ్మెల్యే చిత్రంలోని `నీ ఆశ అడియాశ` అనే పాటతో యస్. జానకి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.  దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియాతో కలిపి మొత్తం పదిహేడు భాషలతో 30వేలకు పైగా పాటలు పాడారు. పెండ్యాల నుంచి రెహమాన్ వరకు ఎందరో సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడిన జానకి

నీలిమేఘాలలో,నీ ఆశ అడియాస,పగలే వెన్నెల జగమే ఊయల,పగలైతే దొరవేరా,నడిరేయి ఏజాములో,సిరిమల్లె పువ్వల్లే నవ్వు,గోవుల్లు తెల్లనా,మనసా తుళ్లిపడకే,ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో,నరవరా ఓ కురువరా, జననీ-వరదాయనీ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, గున్నమామిడి కొమ్మమీదా...

జానకి కొంతకాలం సిరిసిల్లలో, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుని దగ్గర కీర్తనలు నేర్చుకున్నారు.

Updated 23 April 2017, 23 April 2014
Friday, November 4, 2016

Kartika Koti Somavaramu - కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము


7  నవంబర్  2016    కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము

కార్తీక  మాసమున పౌర్ణమి సోమవారము కాని, శ్రవణా నక్షత్రముతో కూడిన సోమవారము కాని కలిసి వచ్చిన రోజును కోటి సోమవారము అందురు. ఆ రోజు నియమ, నిష్ఠలతో ప్రాత:కాలముననే ధనికులు, పేదవారు, బాలలు, వృద్దులు, స్త్రీ, పురుషులనెడి బేధము లేకుండా నదీ స్నానమాచరించి, నుదుట విభూధిని ధరించి పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వదళములతో అర్పించిన, అభిషేకించిన కోటి జన్మల దరిద్రములు తొలగి సుఖశాంతములతో, సిరిసంపదలతో వర్థిల్లుతారు.

కోటి సోమవారమున చేసిన సోమవారం నియమ నిష్ఠలకు కోటి ఇతర  సోమవారముల  నియమ నిష్ఠల ఫలితము లభిస్తుంది అని పురాణముల చెబుతున్నాయి.

7  నవంబర్  2016  

ఈ రోజు  కార్తీక కోటి సోమవారము.  కోటి సోమవారము నాడు స్నానము, దైవ దర్శనము, పగటి ఉపవాసము తప్పక చెయ్యండి.


కార్తీక సోమవార వ్రత మహిమజనకా!  కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కనుక సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును.

కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును.  శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ  ప్రాప్తియు లభించ గలదు.

శివ సహస్రనామ స్తోత్రము
_______________


________________

కార్తీక   పౌర్ణమి   కార్తీక సోమవారము కలసిన రోజు


http://www.greatertelugu.com/telugu-books/Kartheekamasapuranam-book.htm

Tuesday, November 1, 2016

Kartika Puranam in Telugu - Chapter 7

శివ కేశ వార్చన  విధులు

వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి     ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.

'
ఇట్లు కార్తీక మహాత్య మందలి సప్తమధ్యాయము - సప్తమదిన పారాయణము సమాప్తం.

Kartika Puranam in Telugu - Chapter 6

దీపారాధన విధి- మహత్యం

ఓ రాజ శేష్ట్రుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహా విష్ణువును, పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టి వానికి అశ్వమేథ యాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు  దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి, వత్తులు చేయవలెను. వరి పిండితో గాని, ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి  రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యి నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.

ఈ విదముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయ వలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణుల కైననూ బోజన మిడి దక్షణ తాంబూలముల నివ్వ వలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిన సిరి సంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి  కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్టుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట

పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది  ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను. ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.

అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న  మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన ఈ శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాప పరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మహత్యమున్నది.

ఇట్లు   కార్తీక మహాత్య మందలి ఆరవ రోజు పారాయణము సమాప్తము.