Monday, March 26, 2012

ప్రవర్తన - పూజ (బిహేవియర్-Behaviorఅండ్ Prayerప్రయెర్)

ప్రవర్తనలో మార్పు వల్లనే ఫలితములో మార్పు ఉంటుంది. పూజల వల్ల కాదు. పూజలు ప్రవర్తనలో మార్పుకి సహాయ పడాలి. పూజలు చేయించే వాళ్ళు ప్రవర్తనలో మార్పు తెప్పించే ప్రయత్నమూ చెయ్యాలి. అంతేకాని ప్రవర్తనలో మార్పు తేని ఎన్ని పూజలు చేయించినా సమయము వ్యర్ధమే కాని ఫలితము శూన్యమె అవుతుంది.
 
దేవాలయములు కూడా ప్రజల ప్రవర్తనలో మార్పు తేవడానికి దోహద పడాలి.
 
దేవాలయ ప్రసంగములు  ప్రజల ప్రవర్తనలో మార్పు తేవడానికి దోహద పడాలి.
 
Original knol - http://knol.google.com/k/న-ర-యణ-ర-వ/ప-రవర-తన-ప-జ-బ-హ-వ-యర-behaviorఅ-డ/16vr1dtqyinsi/ 3

పారిశ్రామిక సాంకేతిక శాస్త్రము

పారిశ్రామిక సాంకేతిక శాస్త్రము ఫ్రెడరిక్ టేలర్, ఫ్రాన్సిస్ గిల్బ్రేత్, హీరింగ్తాన్ ఎమర్సన్ల పారిశ్రామిక సంస్థలకు లాభాన్ని చేకూర్చే ప్రయత్నముల ఫలితముగా ఉద్భవించింది.
 
ఇటివల కాలములో నారాయణ రావు ఈ శాస్త్రమును మూడు భాగాములగా విభజించ వచ్చు అని అభిప్రాయము వ్యక్తము చేసారు.
 
ఈ మూడు భాగములు
 
౧. మానవ శ్రమ సాంకేతిక శాస్త్రము
౨.  సిస్టం ఎఫిసియన్సి సాంకేతిక శాస్త్రము
౩.  సిస్టం డిజయిన్ యాజమాన్యము
___________________________________________________________________________________________
 
ఈ శాస్త్రముపై నేను ఇంగ్లీషులో నోలులు వ్రాస్తున్నాను.
 
 
వాటినుండి తెలుగులోకి మెల్లమెల్లగా వ్రాయాలి.
 
Original knol - http://knol.google.com/k/-/-/ 16vr1dtqyinsi/ 2

Narayana Rao K.V.S.S. (Telugu) - Bio

నారాయణ రావు కంభంపాటి


తెలుగులో నోలులు వ్రాయడానికి అని ఈ కొత్త  జి మెయిలు ఐ డి తీసుకొని ఇప్పుడు వ్రాయడము మొదలు పెట్టా.
కాని వ్రాయడము కొంచెము కష్టమే.
నా పేరు నారాయణ రావు కంభంపాటి. ప్రస్తుతము ఉండేది ముంబైలో.
నీటీలో ప్రొఫెసర్.
నేను ఇంజనీరింగ్ కాకినాడలో చదివా. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ముంబైలో చదివా.  పి  హెచ్ డి. ఐ. ఐ. టి.లో చేసాను.
ఇంగ్లీష్ లో నేను నోలులు Narayana Rao K.V.S.S. పేరు మీద వ్రాస్తాను.
నా ఇన్స్టిట్యూట్ సహచరులను నోలులు వ్రాయమని ప్రోత్సహిస్తున్నాను. 
తెలుగు ఆర్కుట్ సముదాయములలో నోలు గురించి వ్రాస్తూ ఉంటాను.  
ఇంకా కొన్ని విషయాలు తర్వాత వ్రాస్తా.

Knol is being closed from 1 May 2012. Moving my knols to blogs



Original knol - http://knol.google.com/k/న-ర-యణ-ర-వ/narayana-rao-k-v-s-s-telugu-bio/16vr1dtqyinsi/1

Thursday, March 22, 2012

Gandi Pochamma Temple గండి పోచమ్మ గుడి పాపి కొండలు రాజమండ్రి

గండి పోచమ్మ గుడి పాపి కొండలు రాజమండ్రి

Visit the picture

http://www.panoramio.com/photo/2810849

http://www.panoramio.com/photo/65133362 

Ugadi - నందన నామ సంవత్సర ఉగాది

నేడు నందన నామ సంవత్సర ఉగాది

ఉగాది శుభాకాంక్షలు.

ఈ ఉగాదికి ఒక కవిత


ఉగాది పండుగ వస్తోంది
ఉత్సాహాన్ని తెస్తోంది
ఊరంతా సంతోషం
ఉరకలు వేసే సందోహం

ఉప్పు, పులుపు, చెరుకు, చేదు
ఉపాహారం ఈ రోజు ప్రత్యేకం 
ఉదయం తలంటు పోత
ఉత్సాహం కొత్త బట్టల జత 

ఊరి దేవత సంబరం
ఉత్కంట గొలిపే వినోదం 
ఉగాది పంచాంగ శ్రవణం
ఊరట ఇచ్చే గోచారం వివరం

ఉంది ఉంది మంచి పొంచి  
ఉన్నది గ్రహాల బలం
ఊరికి కొంచెం ఉపకారం 
ఉగ్ర గ్రహాల శాంతికి దానం

ఉన్నత స్థితికి సోపానం
ఉద్వాసన - ఇబ్బందులు మాయం
ఉగాది పండుగ ధ్యేయం 
ఉత్సాహాన్ని పెంచడం

Panchangam

తెలుగు పంచాంగం

చూడండి

http://www.epanchangam.com/