7 నవంబర్ 2016 కోటి సోమవారము - కోటి సోమవారముల ఫలము
కార్తీక మాసమున పౌర్ణమి సోమవారము కాని, శ్రవణా నక్షత్రముతో కూడిన సోమవారము కాని కలిసి వచ్చిన రోజును కోటి సోమవారము అందురు. ఆ రోజు నియమ, నిష్ఠలతో ప్రాత:కాలముననే ధనికులు, పేదవారు, బాలలు, వృద్దులు, స్త్రీ, పురుషులనెడి బేధము లేకుండా నదీ స్నానమాచరించి, నుదుట విభూధిని ధరించి పరమేశ్వరునికి ప్రీతికరమైన బిల్వదళములతో అర్పించిన, అభిషేకించిన కోటి జన్మల దరిద్రములు తొలగి సుఖశాంతములతో, సిరిసంపదలతో వర్థిల్లుతారు.
కోటి సోమవారమున చేసిన సోమవారం నియమ నిష్ఠలకు కోటి ఇతర సోమవారముల నియమ నిష్ఠల ఫలితము లభిస్తుంది అని పురాణముల చెబుతున్నాయి.
7 నవంబర్ 2016
ఈ రోజు కార్తీక కోటి సోమవారము. కోటి సోమవారము నాడు స్నానము, దైవ దర్శనము, పగటి ఉపవాసము తప్పక చెయ్యండి.
కార్తీక సోమవార వ్రత మహిమ
జనకా! కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కనుక సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును.
కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును. శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు లభించ గలదు.
శివ సహస్రనామ స్తోత్రము
_______________
________________
కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారము కలసిన రోజు
http://www.greatertelugu.com/telugu-books/Kartheekamasapuranam-book.htm
No comments:
Post a Comment