Sunday, January 11, 2015

Bhogi Panduga - Telugu - భోగి పండుగ

మనిషి అవసారానికి  పనికొస్తాయంటూ దాఛి  ఉంచిన వస్తువులు ఇంట్లో గదుల్ని ఇరుకుచేస్తుండటంతో పంటలు బాగా పండి క్రొత్త వస్తువులు కొనగలము అనే ధైర్యము కలగడం వాళ్ళ  వాటిని మంటల్లో వేసి చలి తగ్గించుకొని భోగించడంతో భోగి పండగ ప్రారంభం అవుతున్ది. భోగి అంటేనే భోగమయమైన పండగ అని ఈ సమయానికి  రైతు చేతికి పంటలన్నీ వచ్చి ధాన్యపు రాశులతో గాదెలన్నీ నిండి, క్రొత్త వస్తువులు కొనుక్కుని, సౌభాగ్యాలతో విరిసిల్లుతూ,  ఏడాది కాలంగా వాడిన  అనవసర సామాగ్రిని మంటల్లో బూడిద చేసే క్రమంలో ఏర్పడిన పండగే భోగి. ధాన్య లక్ష్మి  తన ఇంటికి వచ్చినందుకు ఏర్పాటు చేసుకున్న పండగగా భోగిని చెప్తారు. పల్లెటూళ్ళలో
అగ్నిదేవుడికి ఆహుతి చేసి , సంతోషాలను ప్రసాదించాలని కోరుకునే పండగ అని కొందరు అన్వయించ వచ్చు.



 దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు ప్రత్యేకమైన  భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది అని కొందరి వ్యాఖ్యానం. 

No comments:

Post a Comment