15 ఆగస్ట్ 2014 స్వాతంత్య్ర దినోత్సవo
మరిచిపోదు మా తరం
మన చరిత్రలోని అపస్వరం
పరాయి దేశ పాలకులు సాగించిన దుష్కరం
భారతమాత జీవితంలో వొక చేదు అనుభవం
విజయనగర పాలకుల దక్షిణంలో విజయం
శివాజీ నాయకత్వం అనేక కోటల ఆధిపత్యం
సన్యాసుల విప్లవం వందే మాతరం నినాదం
అల్లూరి అమర సమరం ఆంధ్రాలో విప్లవం
ఝాన్సీ రాణి వీరమరణం
వేల సిపాయిల జీవన దానం
స్వరాజ్యం నా జన్మ హక్కని తిలక్ ఇచ్చిన నినాదం
భారత దేశం వదిలి పొండని గాంధి ఇచ్చిన ఆదేశం
అనేక యోధుల ప్రాణదానం మనకు మరల వచ్చిన స్వాతంత్ర్యం
భారత మాతకు వైభవాన్ని తిరిగి తేవడం మన కర్తవ్యం
మనమంతా భారత మాత బిడ్డలం భారతీయులం
హిందూస్తాన్ వాసులం హిందువులం
దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయి
గురజాడ మాటలు మరచిపోం
తోటి వానికి గట్టి మేలు తలపెట్టమని మహనీయులు
చెప్పిన మాట కూడా మర్చిపోం
నా ప్రాణం, నా సౌఖ్యమ్
నా కుటుంభం, మా సంపద
నా దేశం, దేశ సౌభగ్యమ్
విశ్వం కూడా నా దేనని మరచిపోం మరచిపోం
నారాయణ రావు
15 ఆగష్టు 2014
Source; http://nraopoems.blogspot.in/2014/08/marichipodu-maa-taram.html
____________________
____________________
ABN Telugu upload
About Independence Day - Feature by Andhra Jyoty
____________________
____________________
ABN Telugu upload
ప్రధాని ప్రసంగ విశేషాలు
____________________
ABN Telugu upload
ప్రధాని శుభాకాంక్షలు తెలుగులో చదవండి. అన్ని భాషలలోను చదివే సదుపాయం ఉంది
http://pib.nic.in/newsite/pmmessage.aspx
No comments:
Post a Comment