చారిత్రక బాపట్ల
లభ్యమైన శాసనాలనుట్టి బాపట్ల ప్రాంతం కులోత్తుంగ చోడ మండలంలోని ఉత్తమ చోడ వలనాడులోని కమ్మనాడులలో ఉన్నట్లు తెలుస్తొంది. కమ్మకరాక లేక కర్మ రాష్ట్ర లేక కమ్మ విషయ అను నామంతరాలు కలిగిన కమ్మనాడు ప్రాచీన ఆంధ్రదేశ ప్రాదేశిక విభాగాలలోని ఒక ముఖ్యమైన నాడు. అనేక ప్రాకృత, సంస్కృత శాసనాలలో పేర్కొనబడిన ఈ ప్రాదేశెక విభాగం గురించి మొట్టమొదటగా క్రీ.శ. 240-260 కాలంలో పరిపాలించిన ఇక్ష్వాక రాజైన వీరపురుషదత్తు వీరపురుషదట్టు జారీచేసిన జగ్గయ్యపేట శాసనంలో పేర్కొనబడింది.గుంటూరు జిల్లాలోగల పూర్వపు నరసరావుపేట మరియు బాపట్ల తాలూకాలు, ప్రకాశం జిల్లాలోగల ఒంగోలు, కర్నూలు జిల్లాలోగల కొన్ని మార్కాపురం ప్ర్రాంతాలు కమ్మనాడులో చేరి ఉన్నవి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చేరివున్న కమ్మనాడు, దీని చుట్టుప్రక్కలగల ఈ ప్ర్రాంతమే ఆంధ్రదేశ చరిత్రలో ప్రముఖమైన పాత్ర నిర్వహించింది.
For more information about bapatla visit చారిత్రక బాపట్ల
No comments:
Post a Comment