జనకా! కార్తిక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కనుక సోమవార వ్రత విధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును.
కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, నది స్నానము చేసి తమశక్తి కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పటన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని తేసుకోనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును. శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో వైకుంట ప్రాప్తియు లభించి గలదు. దీనికి ఉదాహరణము కలదు.
కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాల దినములుకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి ' తండ్రి ఆమెకు సౌరాష్ట్ర దేశియుడగు మిత్ర శర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అబ్యాసించిన వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. నిత్య సత్య వాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడను యగుటచే లోకులెల్లరునతనిని 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొను చు౦ డేడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్టురి యవ్వన గర్వముతో, కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు పువ్వులు, ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చు చున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి, "చీ పోమ్మనక , విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కానీ, చుట్టుప్రక్కల వారి నిష్టురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెను ' కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా' అనియే పిలుస్తూ వుండేవారు.
ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ , ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయీ ఊరి చివరనున్న పాడు నూతిలో బడవైచెను. ఇక తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు, తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, నానాజాతి పురుషులతో సంచరించి వర్ణ సంకరు రాలయ్యెను. అంతే గాక పడుచు కన్యలను, భర్తతో కాపురము చేయుచున్న భార్యలను తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భు ధులు నేర్పి పాడు చేసి, వారి ద్వారా ధనార్జన కూడ చేయసాగాను.
జనక రాజ! యవ్వన బి౦కము యెంతో కాలము౦డదు గదా! కర్కశ వ్రుధాప్య బాధలను అనుభవించి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి నన్నాళ్లు ఒక్కనాడైన పురాణ శ్రవణ మైననూ చేయని పాపిష్టురలు గదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొ౦పోయి ప్రేత రాజగు యముని సన్నిధిలో నుంచగా, యమధర్మ రాజు, చిత్ర గుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా! ఈమే పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే యీమెను తెసుకువెల్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తా౦భామునకు కట్ట బెట్టుదు' అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖి౦చిన౦ దులకు గాను-యమభ టులామేను ఎర్రగా కాల్చిన ఇనుప స్తా౦భామునూ కౌగాలిచుకోమని చెప్పిరి. భర్త నూ బండ రాతిలో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యబిచారి ణి లుగా చేసినదుకు సలసల కరగిన నూనెలో పదవేసిరి. తల్లితండ్రులకు అత్తమామలకు యపకీర్తి తేచినందుకు సీసము కరిగెంచి నోటిలోను, చెవిలోను, పోసి, ఇనుపకడ్డిలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కు౦బిపాకమును నరకములో వేయగా, అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు,జెర్రులు ఆమెను కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాలవాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా చాలా కాలము నరక భాదల ననుభవించి, తిరిగి కళింగ దేశమున కుక్క జన్మమెత్తినది. కుక్కను కర్రతో కొట్టువారు, కొట్టుచు తిట్టువారు, తిట్టుచు, తరుమువారు తరుముచు౦డిరి. కక్క జన్మలో కర్కశ అనేక భాధలను అనుభవించు చున్దెను. కొంత కాలము తర్వాత ఒక కార్తిక మాసములో ఒక సోమ వారము రోజున కుక్కకు పూర్తీ దినమంతయు తిండి దొరక లెదు. ఒకానొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తిక సోమ వార వ్రతమాచరించి ఉపవసము౦డి, సాయ౦త్రము నక్షత్ర దర్శనము చేసి, బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్ళు చేతులు కడుగు కొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నము తినెను. వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ బలియన్నమగుట చేతను, ఆ రోజు కార్తిక మాస సోమ వారమగుట వలననూ, కుక్క ఆ రోజంతాయు ఉపవాసముతో వుండుతవల నను, శివ పూజ పవిత్ర స్థానమున దొరికిన ప్రసాదము తినుట వలనను, ఆ శునకమునకు గత జన్మ జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆశునకము 'విప్రకులోత్తమా! నన్ను కాపాడుము' యని మొరపెట్టు కొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులేవారు లేన౦దుకు లోనికే గెను. మరల ' రక్షిపుము రక్షిపుము'యని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి 'ఎవరు నివు ! నీ వృతంతమేమి!' యని ప్రశ్నించగా, యంత న కుక్క 'మహానుభావ! వెనుక జన్మము నందు విప్రకులా౦గానను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగ పెండ్లాడిన భర్తను జ౦పి, వృద్దాప్యములో కుష్టు రాలనై తనువు చాలించితిని. తరువాత, యమ దూతలవల్ల మహానరక మనుభవించి ఈజన్మలో కుక్కనైతిని. ఈ రోజు ఇచ్చట ఉంచిన బలియన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా , మీరు చేసిన కార్తిక సోమ వార వ్రత ఫల మొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్దించుచున్నాను'యని వేడుకొనగా, కార్తిక సోమవారవ్రతములో చాల మహాత్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికి వందనము జేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమాన మెక్కి శివ సాన్నిధ్యమున కేగెను. వింటివా జనక మహారాజ! కావున ఈ కార్తిక సోమవార వ్రతమాచరించి, శివ సాన్నిధ్యమును పొందుము.
ఒకప్పుడు వశిష్ట మహర్షి మిథిలానగరము నకు వెళ్ళెను. వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్య పాధ్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సు పైజల్లుకొని' మహాయోగి!మునివర్య! తమ రాకవల్ల నేనూ, నాశరిరము, నాదేశము, నాప్రజలు, పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నాదేశము పవిత్రమైనది. చిరకాలమునుండి నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞలనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నాయదృష్టముకొలది యీ అవకాశము దొరికినది. గురురత్న! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేలన౦త పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలాకాలమునుండి యున్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసివున్నది" యని ప్రార్ధి౦చెను.
వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి" రాజ! కార్తిక మాసములో దైవ పూజ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయివున్నది . ఈ కార్తిక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమున౦దాచరించు దైవ కార్యముల యొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. అ౦తియే గాక కార్తీక మహత్యము వినినంత మాత్రముననే మానవులు ఇహమందును, పరమ౦దును సౌఖ్యమును పొందగలరు. ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.
వశిష్టుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట
ఓ మిథిలేశ్వర! జనక మహారాజ! ఏమానవుడైనాను యే వయసువాడైనను " ఉచ్చ- నీచ' అనే భేదములేక కార్తిక మాసములో, సూర్యభగవానుడు తులారాశి య౦దుడగా, వేకువ, జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని, స్నానమాచరించి , దానధర్మములను, దైవ పూజలను చేసినచో - దాని వలన ఆగణిత పుణ్యఫలము లబించును. కార్తికమాస ప్రారంభమును౦డియు యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచు౦డ వలెను. ముందుగా కార్తిక మాసమునునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదర నేను చేయు కార్తిక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించ వలెను.
కార్తిక స్థాన విదానము
ఓ రాజ! యీ వ్రత మాచరి౦చు దినములలో సుర్యోదయమునకు పుర్వమేలేచి కాలకృత్యములు తీర్చుకొని, నదికిబోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ , పరమేశ్వరునకు, బైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యపాదన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను.
ఈకార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగబద్ర, యమునా మున్నగు నదులలో యే ఒక్క నదిలో నైననూ స్నానమాచరించిన యెడల గొప్పఫలము కలుగును.
తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తనే స్వయముగా కోసితెచ్చి నిత్యధూప, దీప , నైవేదములతో భగవంతుని పూజ చేసుకొని, గంధము తీసి భగవంతునికి సమర్పించి తను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిది అభాగ్యతులను పూజించి వారికి ప్రసాద మిడి, తన యింటి వద్దగానీ,దేవాలయములో , లేక రావిచెట్టు మొదట గాని కూర్చుండి కార్తిక పురాణము చదువవలయును.
ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని విష్ణాలయమందుగాని తులసికోట వద్ద గాని , దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను. ఈ విధ ముగా వత్త్రమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును , ప్రస్తుత జన్మమందును చేసిన పాపమూ పోయి మోక్షమునకు ఆర్హులగుదురు . ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారులు వ్రతము చేసిన వారిని జూచి , వారికి నమస్కరించినచొ వారికి కూడా తత్సమాన ఫలముదక్కును .
ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్యమ౦దలి మొదటి అధ్యాయము
ధర్మ వివరణ
దానములు భోజనములు దక్షిణలు ఎవరు ఇవ్వగలరు? సంపాదన ఉన్న వారు మాత్రమె ఇవ్వగలరు చెయ్య గలరు. భగవంతుడు ఒక మనిషి ఇంకొక మనిషికి చేసిన సహాయాన్ని పుణ్యముగా భావించును. అట్టి శక్తి లేనివారు భగవన్నామ స్మరణ వల్లనే పుణ్యాన్ని పొన్దగలరు.