ఉగాది రోజున వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది.
ఈ రోజున చేసే ఉగాది పచ్చడి. వివిధ అనుభవాలకు ఉగాది పచ్చడి ప్రతీక. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. అందరూ ఉగాదినాడు మొదటిగా పచ్చడి తింటారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి చెప్పటం ఈరోజు ముఖ్యమైన కార్యక్రమమ్.