Thursday, November 6, 2014

Kartika Poornima - Telugu



ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తిక పూర్ణిమ. దీనికి శాస్త్రములయందు విశేషమైన మహా వ్రత దినంగా పేర్కొన్నారు. ముఖ్యమైన పర్వాలలో ఇది ఒకటి.

పూర్ణిమ, అమావాస్య పూర్ణ తిథులు కనుక ఈరోజున యే పూర్ణిమ అయినా యే అమావాస్య అయినా కూడా ఈరోజున చేసిన ధ్యానాదులకు అద్భుతమైన విశేష ఫలం వస్తుంది అని సర్వ శాస్త్రములూ చెప్తున్నాయి. పైగా మనకు వేదకాలం నుంచి దర్శ పూర్ణ మాసేష్టులు మొదలైనవి అన్నీ కూడా పూర్ణిమ నాడు చేసే యజ్ఞ యాగాదులకు ఉన్న ఫలితం గురించి చాలా వివరించాయి. పూర్ణిమ నాటి సాధనలు మన మనస్థితిని కూడా ఒక పరిణతిలోకి తీసుకు వెళ్తాయి.


కార్తిక మాసమే వ్రతాల మాసం. ఆ కాలాన్ని కొద్దిపాటి సాధనతో సద్వినియోగం చేసుకుంటే ఇహమూ బాగుంటుంది, పరమూ బాగుంటుంది, పరమార్థమూ లభిస్తుంది. ఈ కార్తికంలో ఏ వ్రతం కొద్దిపాటి చేసినప్పటికీ కూడా విశేష ఫలాన్నిస్తున్నది.


కార్తిక వ్రతములు చాలా ఉన్నాయి. ముఖ్యముగా ఉపవాస వ్రతములు, నక్త వ్రతములు చెప్పబడుతున్నాయి. పగలంతా ఉపవసించి సంధ్యా సమయంలో భగవదారాధన చేసి అటు తర్వాత రాత్రియొక్క ప్రారంభ దశలో ఆహారాన్ని తీసుకుంటే నక్త వ్రతం అని అంటారు. అది పాటించలేనప్పుడు కార్తికంలో స్నానం చేయడం, దీపం పెట్టడం, ఆలయ దర్శనం, ఏదో ఒక పారాయణం, ఏదో ఒక నియమం పెట్టుకోవాలి కార్తిక మాసంలో. అదేవిధంగా ముఖ్య తిథులు కొన్ని ఉన్నాయి పంచ పర్వములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. కార్తికంలో ఈ అయిదింటినీ పంచ మహా పర్వములు అని కూడా అంటారు. దీనికి పంచక వ్రతము అని కూడా పేరు. ఈ అయిదు రోజులూ నియమబద్ధంగా భగవదారాధన చేయడం, అభిషేకాదులు చేయడం చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. అందులో చివరి రోజు పూర్ణిమ. ఈ అయిదూ చేయలేనప్పుడు పూర్ణిమ వ్రతమైనా చేయాలి. నెలరోజులూ వీలు కానప్పుడు అయిదు రోజులు, అయిదు రోజులూ వీలు కానప్పుడు పూర్ణిమ. అంత ప్రాధాన్యమున్నది. పైగా ఈ సమయంలో దీప దానం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వీలైనన్ని దీపాలు వెలిగించి భగవదారాధన చేయాలి.

మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, కార్తిక మాసం దీపానికీ ప్రాధాన్యమిచ్చినది. ఒక్క దీపం భగవంతుని ఉద్దేశించి వెలిగించినట్లయితే అది మనకున్న అజ్ఞాన దారిద్ర్యాలను బాధలను తొలగిస్తుందని శాస్త్ర వచనం. పూర్ణిమ నాడు ఏ చిన్నపాటి సాధన చేసినప్పటికీ మహా యజ్ఞ ఫలితం వస్తుంది. అందుకే సంవత్సరంలో ఈ రోజును మాత్రం వృధా చేసుకోరాదు. ఈరోజున ఉపవాసము/ఆహార నియమము పాటిస్తూ స్నానము, దీపము, దానము, ధ్యానము ఇత్యాదులు చేయాలి.

ఈరోజున చేసేది ఏదైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. దీపం వెలిగించడంతో పాటు ఒక పీటపై స్వస్తిక్ చిహ్నాన్ని, పద్మాన్ని, శంఖము, చక్రము, శ్రీకారము కూడా లిఖించి వాటిని పూజ చేస్తే ఒక విశేషం అన్నారు. స్వస్తిక్ చిహ్నమే శుభాన్ని, లాభాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తారు.


కార్తిక మాసంలో విష్ణువును దామోదర అనే పేరుతొ ఆరాధిస్తారు.  దామోదర అన్న మాటకి సర్వ భూతములూ తనలో కలిగినవాడు అని అర్థం. అలాంటి దామోదర మాసమిది. అందుకు కార్తిక దామోదర ప్రీత్యర్థం అని ఏ కర్మనైనా చేస్తారు.

అలాంటి ఆ దామోదరుడు కృష్ణావతారంతో ధన్యులైన గోపికలతో కలిసి రాసలీల చేసినటువంటిది.
రాసలీల అంటేనే ఒక పూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం. జీవాత్మలు పరమాత్మతో లీనమైనటువంటి అవస్థని ఇక్కడ రాసలీల అంటారు. ఆ రాసలీలావస్థ ఒక పూర్ణావస్థ.  ఆ పూర్ణావస్థలో కలిగే దివ్యానందమే రాసలీలానుభవం. అందుకు ఈ రాసలీల జరిగినటువంటి రోజు కూడా ఇది.

మహాకార్తికి

మహాకార్తికి అంటే కృత్తిక నక్షత్రముతొ కలసిన కార్తిక పూర్ణమి

అంతేకాదు ఈ రోజు ఏ దేవతను ఆరాధించినా విశేషమే. ఎందుకంటే దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నక్షత్రం కృత్తిక; ఏ దేవతను ఆరాధించాలన్నా "అగ్నిముఖావై దేవాః" అన్నారు గనుక ఈ అగ్ని నక్షత్రమైన కృత్తిక నాడు ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత సంపూర్ణమైన తృప్తిని పొందుతుంది.


అంతేకాదు ఆదివారం సూర్యుని, శివుని; సోమవారం గౌరీదేవిని; మంగళవారం సుబ్రహ్మణ్యుని, గణపతిని; బుద్ధవారం విష్ణువును, గురువారం బ్రహ్మ దేవుని, దక్షిణామూర్తి, హయగ్రీవ వంటి గురుస్వరూపాలను; శుక్ర వారం ఇంద్రుని, ఇంద్రుడు ఆరాధించిన మహాలక్ష్మిని; అలాగే శనివారం శనైశ్చరుని, యముని, రుద్రుని ఆరాధించాలి అని మనకు శాస్త్రములు చెప్తున్నాయి. ఇవి ఏ మాసంలో చేసినా విశేషమే. కానీ అన్ని మాసాలలో ఏడు రోజుల వ్రతం మనం చేయలేం. కానీ కార్తికంలో మాత్రం ఈ వార యజనం చేస్తే సంవత్సరం అంతా వారయజనం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకే కార్తికంలో ఏది చేసినా సంవత్సరమంతా ఆ యజ్ఞము చేసిన ఫలితం వస్తుంది.

అందులో ప్రత్యేకించి ఈ పూర్ణిమ నాడు పైన చెప్పిన నియమాలతో పరమేశ్వరుని, విష్ణువుని ఆరాధించాలి. శాస్త్రబద్ధమైన నియమ పాలనతో మహాకార్తికి సాధన చేసి కార్తిక దీప జ్యోతిలో ఆ పరమేశ్వర ప్రకాశాన్ని దర్శించి ధన్యులమౌదాం.

Thursday, September 25, 2014

Dasara - Durga Vaibhavam - Telugu




దుర్గా వైభవం చాగంటి ప్రవచనం

Chaganti Koteswara Rao - Durga Vaibhavam Pravachanam

భాగం 1
______________

______________

భాగం 2
______________

______________

పార్ట్ 3
______________

______________

Friday, August 29, 2014

Vighneswara Mangala Harati Song - హారతి గైకొనుమా గణనాయక - విఘ్నేశ్వర మంగళ హారతి పాట



విఘ్నేశ్వర మంగళ హారతి పాట 


హారతి గైకొనుమా గణనాయక
మంగళ హారతి గైకొనుమా గణనాయక

అఖువాహనాయ అగ్రపూజ్యాయ
హారతి గైకొనుమా గణనాయక
ఇభావక్త్రాయా ఈశ్వరపుత్రా

హారతి గైకొనుమా గణనాయక
ఉమాసుతా ఊర్జస్వలుడా
హారతి గైకొనుమా గణనాయక
ఏకదంతా ఏకాగ్రచిత్తా
హారతి గైకొనుమా గణనాయక
మంగళ హారతి గైకొనుమా గణనాయక

కళ్యాణగురువా కనకాంబరా
హారతి గైకొనుమా గణనాయక
గజాననా గణనీయా
హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక


హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

హారతి గైకొనుమా గణనాయక

Written by Narayana Rao - 9 September 2013



మంగళ మని మంగళ మని పాడరే మన గణ నాథునకు
____________________

____________________
Telugu Bhaktisongs upload

Updated 29 August 2014 - 2014 Vinayaka Chaviti

Thursday, August 28, 2014

Vinayaka - Bhakti Patalu - వినాయక భక్తి పాటలు


వినాయక భక్తి  పాటలు


_____________________

_____________________
Maa Tv Upload
28 August 2014


Ganesh Chaturdhi Songs - 2012 Juke Box - Aditya Music

    Ganesha Telugu Songs - Source: Aditya Music YT video - below
_____________________

_____________________

Friday, August 15, 2014

15 August 2014 - స్వాతంత్య్ర దినోత్సవo - Celebrations - PM's Speech - CM Chandrababu Naidu Speech in Telugu


15 ఆగస్ట్ 2014 స్వాతంత్య్ర దినోత్సవo


మరిచిపోదు మా  తరం
మన చరిత్రలోని అపస్వరం
పరాయి దేశ పాలకులు సాగించిన దుష్కరం
భారతమాత జీవితంలో వొక చేదు అనుభవం

విజయనగర పాలకుల దక్షిణంలో విజయం
శివాజీ నాయకత్వం అనేక కోటల ఆధిపత్యం
సన్యాసుల విప్లవం వందే మాతరం నినాదం
అల్లూరి అమర సమరం ఆంధ్రాలో విప్లవం

ఝాన్సీ రాణి వీరమరణం
వేల సిపాయిల జీవన దానం
స్వరాజ్యం నా జన్మ హక్కని తిలక్   ఇచ్చిన నినాదం
భారత దేశం వదిలి  పొండని గాంధి ఇచ్చిన ఆదేశం

అనేక యోధుల ప్రాణదానం మనకు మరల వచ్చిన స్వాతంత్ర్యం
భారత  మాతకు వైభవాన్ని తిరిగి తేవడం మన కర్తవ్యం
మనమంతా భారత మాత బిడ్డలం భారతీయులం
హిందూస్తాన్ వాసులం హిందువులం

దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయి
గురజాడ మాటలు మరచిపోం
తోటి వానికి గట్టి మేలు  తలపెట్టమని మహనీయులు
చెప్పిన మాట కూడా మర్చిపోం

నా ప్రాణం, నా సౌఖ్యమ్
నా కుటుంభం, మా సంపద
నా దేశం, దేశ సౌభగ్యమ్
విశ్వం కూడా నా దేనని మరచిపోం  మరచిపోం

నారాయణ రావు
15 ఆగష్టు 2014
Source; http://nraopoems.blogspot.in/2014/08/marichipodu-maa-taram.html


____________________

____________________
ABN Telugu upload


About Independence Day - Feature by Andhra Jyoty
____________________

____________________
ABN Telugu upload

ప్రధాని ప్రసంగ విశేషాలు
____________________

ABN Telugu upload

ప్రధాని శుభాకాంక్షలు తెలుగులో చదవండి. అన్ని  భాషలలోను చదివే   సదుపాయం  ఉంది
http://pib.nic.in/newsite/pmmessage.aspx

Thursday, July 10, 2014

India Budget 2014-15 in Telugu


Arun Jaitley's Speech - Uploaded by Mango News
_____________________

_____________________